![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో..ఇంట్లో ఏది కావాలన్నా కూడా ఆ కావ్యని అడగలిసి వస్తుంది. ఇలాగే చూస్తూ ఉంటే కుదరదు. ఇంటి బాధ్యతలు మీకైన నాకైనా ఇవ్వమని అడగండి అని ధాన్యలక్ష్మితో అనామిక చెప్తుంది. సరే అని అనామికని ధాన్యలక్ష్మి హాల్లోకి తీసుకొని వెళ్తుంది.
అప్పటికి అందరు హాల్లోనే కూర్చొని ఉంటారు. నాకు నా కోడలికి ఏం పని చెప్తారో చెప్పండి. అందరు పని వాళ్ళని తీసేయండి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు ఇప్పుడు ఏమైందని అపర్ణ అడుగుతుంది. కళ్యాణ్ ని అనామిక బయటకు తీసుకొని వెళ్ళని అడిగిందంట.. నా దగ్గర కార్డ్స్ ఏం లేవు.. మా వదినని అడగాలని అన్నాడట. ఇలా ప్రతి దానికి చెయ్యి చాపాల్సిన కర్మ మాకు ఎందుకని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ కావ్య ఎలాగూ ఆఫీస్ కి వెళ్తుంది.. ఇంటి బాద్యతలు నాకు గానీ నా కోడలికి గాని ఇవ్వండి అని ధాన్యలక్ష్మి అనగానే.. ఇంటి బాధ్యతలపై మీ కన్ను పడిందా అని స్వప్న అంటుంది. ఆ తర్వాత దీనికి సమాధానం కళ్యాణ్ మాత్రమే చెప్తాడని అపర్ణ అంటుంది. నాకేం ఖర్చులు ఉంటాయని నా కార్డ్స్ అన్ని పెద్దమ్మకి ఇచ్చాను. ఆ కార్డ్స్ పెద్దమ్మ తీసుకొని వెళ్లి లాకర్ లో పెట్టింది. ఆ లాకర్ కీస్ వదిన దగ్గర ఉన్నాయి.. వచ్చాక వదినని అడిగి బయటకు వెళదామని అన్నాను.. అంటే ఇందులో వదినకి గానీ పెద్దమ్మకి గానీ ఎలాంటి సంబంధం లేదని కళ్యాణ్ చెప్తాడు. ఇక ఇంటి బాధ్యతలంటే అది తరతరాలుగా ఇంటి పెద్ద కోడలికి మాత్రమే ఉంటాయి. ఇలాగే మాట్లాడితే నేను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు చెప్పిన ఇక వినను. కళ్యాణ్ నీ కార్డ్స్ తీసుకుని నీకు నచ్చినట్టు ఖర్చులు పెట్టుకోవద్దు అనేవారు గానీ లెక్క అడిగేవారు గానీ లేరని అపర్ణ చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ ఆఫీస్ లో కూర్చొని.. ఈ కావ్య ఇంకా రావడం లేదేంటని అనుకుంటాడు. అప్పుడే. శ్వేత వస్తుంది. కావ్య గురించి టెన్షన్ పడుతున్న రాజ్ ని చూసి.. కావ్య వస్తుంది లే అని చెప్తుంది. కావ్య వాళ్ళ బావని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిందని రాజ్ జెలస్ గా ఫీల్ అవుతు ఉంటాడు. మరొక వైపు కళ్యాణ్ , అనామికలకి అప్పు ఎదరుపడుతుంది. నీతో చాలా మాట్లాడాలి ఇంటికి రా అప్పు అని కళ్యాణ్ కార్ ఎక్కుతాడు. నువ్వు ఇష్టపడ్డ వాన్ని నేను పెళ్లి చేసుకున్న అని అనామిక పొగరుగా మాట్లాడుతుంటే.. నా ప్రేమలో నిజాయితి ఉంది అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు ఇప్పటికైన కళ్యాణ్ ని నా సొంతం చేసుకోగలను. అన్నీ మానేసి కళ్యాణ్ ని బాగా చూసుకో.. వాడు మంచోడని అనామికకి గట్టిగా కౌంటర్ ఇస్తుంది అప్పు. తరువాయి భాగంలో కావ్య తన బావని తీసుకొని వస్తుంటే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |